Endhuko e gora papini ఎందుకో ఈ ఘోర పాపిని
ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీసావు ప్రభువా
ఏముంది నాలో ఏ పరిశుద్దత లేదే
ఐనను నన్ను ప్రేమించావు కరుణించావు నన్ను రక్షించావూ
నా అతిక్రమములకై నా పాపములకై గాయాలు పొందినావే
నా దోషములకై కురూపిగా మారి నీ నోరు తెరువలేదే
నీప్రేమ మధురం నీ ప్రేమ అమరం
నీ త్యాగమే నన్ను రక్షించింది.
ఉమ్మిరి నీదు మోము పైనా నాకోసం భరియించావా!
గ్రుచ్చిరి శిరమున ముళ్ళ మకుటాన్ని నా కొరకై భరియించావా!!
నీ ప్రేమ మ అధురం నీ ప్రేమ అమరం
నీ బలియాగం నన్ను రక్షించింది.
అన్యాయపు తీర్పు పొందావ నాకై అపహాస్యం భరియించావా!
ఆదరణ కరువై బాధి౦పబడియూ నీ నోరు తెరువ లేదే
నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం
నీ బలియాగం నన్ను రక్షించింది.