Parishuddame Yesuni raktham pravahinchenu kalvarilo పరిశుద్ధమే యేసుని రక్తం ప్రవహించెను కల్వరిలో
పరిశుద్ధమే యేసుని రక్తం – ప్రవహించెను కల్వరిలో
కడుగబడుము పావన రక్తం – ప్రభుయేసునే ఆరాధించు
సూరూపమైనను సొగసైననులేదు – తృణీకరింపబడెను
విసర్జించిరి మనుజులెల్లరును – దైవమే చేయి వీడెను
పదివేలలోన అతిసుందరుండు – రూపునే కోల్పోయెను
వ్యసనాక్రాంతుడుగా వ్యాధిగ్రస్థునిగా – కనిపించే నా ప్రియుడు
మనము చూడనొల్లని స్వరూపుడాయె – మనమెన్నిక చేయలేదు
పదివేలలోన అతి శ్రేష్ఠనీయుడు – హీనునిగా చేయబడెను
మన రోగములను భరియించె ప్రభువే – నిశ్చయముగా ఆ సిల్వపై
మన వ్యసనములన్ని వహియించినతడే – దేవుని వధ గొర్రెపిల్లయి
పదివేలలోన అతిపరిశుద్ధున్డు – పాపముగా చేయబడెను
మన దోషములకై గాయములనొంది – స్వస్థతనిచ్చే ప్రియుడై
మన సమాధానార్థమైన శిక్ష భరియించె – నలుగగొట్టబడెను
పదివేలలోన అతిమహాఘనుడు – రక్తపుముద్దాయెను
బాధింపబడిన మౌనియైయుండెను – నోరుతెరువడాయెను
అన్యాయపుతీర్పు నొందినవాడై – బలియాయేనాసిల్వలో
పదివేలలోన అతికాంక్షణీయుడు – ద్వేషింపబడికూలెను
parishuddame yesuni raktham – pravahinchenu kalvarilo
kadugaabadumu paavana raktham – prabhuyesune aaraadhinchu
sooroopamainanu sogasainanu ledu – thruneekarinpabadenu
visarginchiri manujulellarunu – daivame cheyi veedenu
padhivelalona athisundarundu – roopune kolpoyenu
vyasanaakraanthudugaa vyaadhigrasthunigaa – kanipinche naa priyudu
manamu choodanollani swaroopudaaye – manamennika cheyaledu
padhivelalona athi sreshtaneeyudu – heenuniga cheyaabadenu
mana rogamulanu bhariyinche prabhuve – nischayamuga aa silvapai
mana vyasanamulanni vahinchinathade – devuni vadha gorrepillayi
padhivelalona athi parishuddundu – paapamuga cheyaabadenu
mana dhoshamulakai gaayamulanondhi – swasthathaniche priyudai
mana samaadhaanaardhamaina siksha bhariyinche – nalugagottabadenu
padhivelalona athi mahaaganudu – rakthapu muddaayenu
baadhinpabadina mouniyai yundenu – noru theruvaadaayenu
anyaayapu theerpu nondhinavaadai – baliyaayena silvalo
padhivelalona athi kaanshaneeyudu – dhweshinpabadi koolenu