thaaraa velisenu ee vela తారా వెలిసెను ఈ వేళ
తారా వెలిసెను ఈ వేళ
యేసు పుట్టిన శుభవేళ (2)
వెలిగెను ఈ లోకం – మదిలో నిండెను ఆనందం
తరగని రక్షణను – మనకై తెచ్చెను ఆ దైవం (2)
రండి వార్తను చాటుదాము
ఆ రక్షణను పంచుదాము (2) ||తారా||
పశుల పాకే పావనమాయె
మంద గొల్లలే తన వారాయె (2)
జ్ఞానులొచ్చిరి ఆరాధింప
రాజులలో భీతిని నింప (2) ||తారా||
పాపమెరుగని నీతి పరుడు
లోకమును కాచే రక్షకుడు (2)
కన్య మరియా గర్భమున
పుట్టెను దేవుని అంశమున (2) ||తారా||
రాజులకు రాజైన తనకు
ఇచ్చుటకు ఏమున్నది మనకు (2)
వెండి బంగారముల కన్నా
హృదములనర్పిస్తే మిన్నా (2) ||తారా||
thaaraa velisenu ee vela
yesu puttina shubhavela (2)
veligenu ee lokam – madilo nindenu aanandam
tharagani rakshananu – manakai thechchenu aa daivam (2)
randi vaarthanu chaatudaamu
aa rakshananu panchudaamu (2) ||thaaraa||
pashula paake paavanamaaye
manda gollale thana vaaraaye (2)
gnaanulochchiri aaraadhimpa
raajulalo bheethini nimpa (2) ||thaaraa||
paapamerugani neethiparudu
lokamunu kaache rakshakudu (2)
kanya mariyaa garbhamuna
puttenu devuni amshamuna (2) ||thaaraa||
raajulaku raajaina thanaku
ichchutaku emunnadi manaku (2)
vendi bangaaramula kannaa
hrudayamulanarpisthe minnaa (2) ||thaaraa||