• waytochurch.com logo
Song # 21912

karuna choopinchumaa yesayya kanneeru thudavagaa కరుణ చూపించుమా యేసయ్య కన్నీరు తుడవగా


కరుణ చూపించుమా – యేసయ్య కన్నీరు తుడవగా
మహిమ కురిపించుమా – యేసయ్య స్వస్థతలు చూపగా (2)
నీ ప్రజలము అయిన మేము – మృత్యువు కోరలో చిక్కాము
ఏ దారియు కానరాక – నశియించి పోతున్నాము (2)
కరుణగల దేవుడు నీవు
కరుణించి కాపాడుమా (2) ||కరుణ||

ఐగుప్తులో పది తెగుల్లలో – నీ ప్రజలను కాపాడితివి
గొఱ్ఱెపిల్ల రక్తము నిచ్చి – మృత్యువాత తప్పించితివి (2)
నీ నామము మదిలో నిలిపి – ఈ ఆపదలో వేడాము
నీ మహిమను తిరిగి చూడగా – నీ సన్నిధిలో చేరాము (2) ||కరుణగల||

ఇశ్రాయేలు వారిగ మేము – నీ ఉనికిని ప్రశ్నించాము
నీ ప్రేమను రుచి చూసిననూ – మారాను కురిపించాము (2)
చెలరేగే సర్పము కాటు – మములను కబళించే వేళ
మాకు దిక్కు నీవేనంటూ – మోకరించి నిను వేడితిమి (2) ||కరుణగల||

మరణమునే జయించి నీవు – సజీవుడిగా నిలిచావు
నిన్ను నమ్మి వేడిన చాలు – మా తప్పులు మరిచావు (2)
నేను జీవించితి గనుక – మీరును జీవించెదరన్న
వాగ్దానము నమ్మితిమయ్యా – నెరవేర్చుము మా యేసయ్య (2) ||కరుణగల||

karuna choopinchumaa – yesayya kanneeru thudavagaa
mahima kuripinchumaa – yesayya swasthathalu choopagaa (2)
nee prajalamu aina memu – mruthyuvu koralo chikkaamu
ae daariyu kaanaraaka – nashiyinchi pothunnaamu (2)
karunagala devudu neevu
karuninchi kaapaadumaa (2) ||karuna||

aigupthulo padi thegullalo – nee prajalanu kaapadithivi
gorrepilla rakthamunichchi – mruthyuvaatha thappinchithivi (2)
nee naamamu madilo nilipi – ee aapadalo vedaamu
nee mahimanu thirigi choodagaa
nee sannidhilo cheraamu (2) ||karunagala||

ishraayelu vaariga memu – nee unikini prashninchaamu
nee premanu ruchi choosinanu – maaraanu kuripinchaamu (2)
chelarege sarpamu kaatu – mamulanu kabalinche vela
maaku dikku neevenantu
mokarinchi ninu vedithimi (2) ||karunagala||

maranamune jayinchi neevu – sajeevunigaa nilichaavu
ninnu nammi vedina chaalu – maa thappulu marichaavu (2)
nenu jeevinchithi ganuka – meerunu jeevinchedaranna
vaagdhaanamu nammithimayyaa
neraverchumu maa yesayya (2) ||karunagala||


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com