jeevamu gala devuni sangham entho entho ramyamu జీవము గల దేవుని సంఘం ఎంతో ఎంతో రమ్యము
జీవము గల దేవుని సంఘం – ఎంతో ఎంతో రమ్యము
మనకై దేవుని సంకల్పం – ఎంతో ఎంతో శ్రేష్ఠము
సంకల్పమందున మనముండినా
ఆ సంఘమందున వసియించినా
ఎంతో ఎంతో ధన్యము – (2) ||జీవము||
యేసే స్వరక్తమిచ్చి – సంపాదించిన సంఘము
సత్యమునకు స్థంభమును – ఆధారమునైయున్నది (2)
పాతాళలోక ద్వారములు
దాని ఎదుట నిలువవు (2) ||జీవము||
యేసే శిరస్సైయున్న – శరీరము మనమందరము
పరిశుద్ధాత్మ మనలో – నివసించుచున్నాడు (2)
ఏ నరుడు దేవుని నిలయమును
పాడు చేయకూడదు (2) ||జీవము||
యవ్వన ప్రాయము మనలో – భవ్యానికి భయపడక
సవ్వడి చేయుచు నిరతం – కవ్వించు చుండును (2)
ప్రభు యేసు దివ్య మాదిరిలో
గమ్యము చేరగా సాగుదాం (2) ||జీవము||
ఏ ప్రాంతీయుల మైన – మనమందరము సోదరులం
శాశ్వత రాజ్యపు గురిలో – శ్రీ యేసుని సహ వారసులం (2)
లోకాన యేసుని త్యాగమును – సాహసముతో చాటుదాం
లోకాన క్రీస్తుని మహిమను – సహనముతోనే చాటుదాం ||జీవము||
jeevamu gala devuni sangham – entho entho ramyamu
manakai devuni sankalpam – entho entho sreshtamu
sankalpamanduna manamundinaa – aa sanghamanduna
vasiyinchinaa entho entho dhanyamu
yese swarakthamichchi sampaadinchina sanghamu
sathyamunaku sthambhamunu aadhaaramunaiyunnadi (2)
paathaala loka dwaaramulu
daani eduta niluvavu (2) ||jeevamu||
yese shirassai yunna – shareeramu manamandaramu
parishuddhaathma manalo nivasinchuchunnaadu (2)
ae narudu devuni nilayamunu
paadu cheyakoodadu (2) ||jeevamu||
yavvana praayamu manalo – bhavyaaniki bhayapadaka
savvadi cheyuchu niratham – kavvinchu chundunu (2)
prabhu yesu divya maadirilo
gamyamu cheragaa saagudaam (2) ||jeevamu||
ae praantheeyulamaina – manamandaramu sodarulam
shaashwatha raajyapu gurilo – shree yesuni saha vaarasulam (2)
lokaana yesuni thyaagamunu – saahasamutho chaatudaam
lokaana kreesthuni mahimanu – sahanamuthone chaatudaam ||jeevamu||