• waytochurch.com logo
Song # 22058

kannulatho choose ee lokam entho andamugaa srushtinchabadenu bhoolokam కన్నులతో చూసే ఈ లోకం ఎంతో అందముగా సృష్టించబడెను భూలోకం


కన్నులతో చూసే ఈ లోకం ఎంతో – అందముగా సృష్టించబడెను భూలోకం
దేవుని ఆలయముగా ఈ దేహం – పరిశుద్ధునిగా సృష్టించే శరీరం
నా దేవుని సృష్టియేగా ఈ లోకం – ఆ సృష్టికర్త పనియేగా
నా యేసుని సృష్టియేగా ఈ లోకం – ఆ సృష్టికర్త పనియేగా… ఈ దేహం

అల్ఫా ఒమెగయైన మహిమకు పాత్రుడైన దేవుడు
మహిమ పొందాలని ఘనత నొందాలని
వేవేల దూతలతో కొనియాడబడు దేవునికి
నువ్వు కావాలని తన రాజ్యం స్థాపించాలని (2)
తన పోలికలో నిర్మించుకొని – ఆ హృదిలో ఉండాలని (2)
నా దేవుడే కోరెనుగా – నీ హృదయాన్ని తనకీయవా ||కన్నులతో||

నీటిబుడగ వంటిదేగా ఈ జీవితం
ఆవిరైపోవును ఇది మన్నైపోవును
అల్ప కాలమేగా ఈ లోకము
పాడైపోవును ఇది లయమైపోవును (2)
ఈ సృష్టిని దేవునిగా నీవు సృష్టిని పూజించావు
సృష్టికర్త దేవుడినే మరచి అంధుడవై బ్రతికావు
ఆ యేసయ్య నీ కోసమై నీ శాపాన్ని భరియించెను
నిత్య జీవము నీకిచ్చుటకై సిలువలో చేతులే చాచి నిను పిలచెను ||కన్నులతో||

kannulatho choose ee lokam entho – andamugaa srushtinchabadenu bhoolokam
devuni aalayamugaa ee deham – parishuddhunigaa srushtinche shareeram
naa devuni srushtiyegaa ee lokam – aa srushtikartha paniyegaa
naa yesuni srushtiyegaa ee lokam – aa srushtikartha paniyegaa.. ee deham

alphaa omegayaina mahimaku paathrudaina devudu
mahima pondaalani ghanatha nondaalani
vevela doothalatho koniyaadabadu devuniki
nuvvu kaavaalni thana raajyam sthaapinchaalani (2)
thana polikalo nirminchukoni – aa hrudilo undaalani (2)
naa devude korenugaa – nee hrudayaanni thanakeeyavaa ||kannulatho||

neeti budaga vantidegaa ee jeevitham
aaviraipovunu idi mannaipovunu
alpa kaalamegaa ee lokamu
paadaipovunu idi layamaipovunu (2)
ee srushtini devunigaa neevu srushtini poojinchaavu
srushtikartha devudine marachi andhudavai brathikaavu
aa yesayya nee kosamai nee shaapaanni bhariyinchenu
nithya jeevamu neekichchutakai siluvalo chethule chaachi ninu pilachenu ||kannulatho||


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com