yesayyaa nee poola thota యేసయ్యా నీ పూల తోట
యేసయ్యా నీ పూల తోట
పుష్పించ లేదెందు చేత – (2)
రకరకాల విత్తనాల
ప్రేమ మీద చల్లినావు (2)
మోసులెత్తినా – చిగురాకు లేచినా
పూవులెందుకు పూయలేదు
ఫలమెందుకు పండలేదు ||యేసయ్యా||
సంఘాల స్థాపించినావు
సదుపాయములిచ్చినావు (2)
సంఘమెదిగినా – సంఖ్య పెరిగినా (2)
సాంగత్య ప్రశాంతి లేదు
సౌరభ్యము నిండలేదు ||యేసయ్యా||
స్వార్ధ రహితుల కాపు లేదు
ఆత్మ జీవికి పెంపు లేదు (2)
సేవ చేసినా – సువార్త సాగినా (2)
పూలెందుకు పూయలేదు (2)
ఫలమెందుకు పండలేదు ||యేసయ్యా||
yesayyaa nee poola thota
pushipincha ledendu chetha – (2)
rakarakaala vitthanaala
prema meeda challinaavu (2)
mosuletthinaa – chiguraaku lechinaa
poovulenduku pooyaledu
phalamenduku pandaledu ||yesayyaa||
sanghaala sthaapinchinaavu
sadupaayamulichchinaavu (2)
sanghamediginaa – sankhya periginaa (2)
saangathya prashaanthi ledu
sourabhyamu nindaledu ||yesayyaa||
swaardha rahithula kaapu ledu
aathma jeeviki pempu ledu (2)
seva chesinaa – suvaartha saaginaa (2)
poolenduku pooyaledu (2)
phalamenduku pandaledu ||yesayyaa||