Oh praardhana su praardhana nee praabavambun marathuna ఓ ప్రార్ధన సుప్రార్ధన నీ ప్రాభవంబున్ మరతునా
ఓ ప్రార్ధన సుప్రార్ధన – నీ ప్రాభవంబున్ మరతునా?
నా ప్రభువున్ ముఖా ముఖిన్ – నే బ్రణుతింతు నీ ప్రభన్
నా ప్రాణమా సుప్రార్ధనా – నీ ప్రేరణంబుఁచే గదా
నీ ప్రేమధార గ్రోలుదు -నో ప్రార్ధన సుప్రార్ధన
పిశాచి నన్ను యుక్తితో – వశంబు చేయ జూచుచో
నీ శాంతమైన దీప్తియే – నా శంకలెల్ల మానుపున్
నీ శక్తి నేను మరతునా – నా శైలమా నా ప్రార్ధన
నా శోకమెల్ల దీర్చెడు – విశేషమైన ప్రార్ధన
నీ దివ్యమైన రెక్కలే నా దుఃఖభార మెల్లను
నా దేవుడేసు చెంతకు – మోదంబు గొంచుఁబోవును
సదా శుభంబు లొందను – విధంబు జూప నీవేగా
నా ధైర్యమిచ్చు ప్రార్ధన – సుధా సుధార ప్రార్ధన
అరణ్యమైన భూమిలో – నా రమ్యమౌ పిస్గా నగం
బు రంగుగాను నెక్కినా – చిరగృహంబు జూతును
శరీరమున్ విదల్చినే – బరంబు బోవు వేళలో
కరంబు నిన్ను మెచ్చెదన్ – పరేశు ధ్యాన ప్రార్ధన
oh praardhana su praardhana – nee praabavambun marathuna
naa prabhuvun mukhamukin – ne branuthinthu nee praban
naa praanamaa su praardhana – nee preranambuche gadha
nee premadhaara groludhu – no praardhana su praardhana
pisaachi nannu yukthitho – vasambu cheya joochucho
nee saanthamaina deepthiye – naa sankalella maanuvun
nee sakthi nenu marathunaa – naa sailamaa naa praardhana
naa sokamella dheerchedu – viseshamaina praardhana
nee divyamaina rekkale naa dhukkabaara mellanu
naa devudesu chenthaku – modhambu gonchubovunu
sadhaa subhanbu londhanu – vidhanbu joopa neevegaa
naa dairyamichu praardhana – sudhaa sudhaara praardhana
aranyamaina bhoomilo – naa ramyamou pisganagam
bu rangugaanu nekkina – chiragruhambu joothunu
sariramun vidhalchine – burambu bovu velalo
karambu ninnu mechedhan – paresu dhyaana praardhana