Manninchina aa preme naa sonthamaa మన్నించినా ఆ ప్రేమే నా సొంతమా
మన్నించినా ఆ ప్రేమే నా సొంతమా
నీ చెంతనా నే చేరి ప్రార్ధించనా
కలనైనా ఇలా మరతును
ఎనలేని నీ ప్రేమను
నీవేగా నీవేగా
నీవే నా ప్రాణ దైవమా
శిలనేనైన రూపం చేసి జీవం పోసితివి
నిరతము నాకు మాదిరి నీవై దారి చూపితివి
నా చేతులను సుఖముతో నింపి నడిపే నీ ప్రేమ
అపారము నీ దయాగుణం అనంతము నీ ప్రేమామృతం
నీవు నా ప్రాణం
ఊహకు అందని త్యాగం చేసి శ్వాసై నిలిచావు
నీ ముఖకాంతిలో వెలుగై నన్ను మార్చుకొన్నావు
గతమేదైనా ప్రేమించావు స్తుతికే పాత్రుడవు
ప్రతిక్షణం నా నిరాశలో ప్రభాతమైనా నా యేసయ్య
నీవు నా ధ్యానం
manninchina aa preme naa sonthamaa
nee chenthanaa ne cheri praardhinchanaa
kalanainaa ila marathunu
enaleni nee premanu
neevegaa neevegaa
neeve naa praana daivamaa
silanenaina roopam chesi jeevam posithivi
nirathamu naaku maadhiri neevai dhaari choopithivi
naa chethulanu sukhamutho nimpi nadipe nee prema
apaaramu nee dayaagunam ananthamu nee preamaamrutham
neevu naa praanam
oohaku andhani thyaagam chesi swaasai nilichaavu
nee mukhakaanthilo velugai nannu maarchukonnaavu
gathamedainaa preminchaavu sthuthike paathrudavu
pratikshanam naa niraasalo prabhaathamainaa naa yesayya
neevu naa dhyaanam