• waytochurch.com logo
Song # 22236

Madhuramaina prematho nannu preminchithivi మధురమైన ప్రేమతో నన్ను ప్రేమించితివి


మధురమైన ప్రేమతో నన్ను ప్రేమించితివి
ఆశ్చర్యమైన నీ కృపతో నన్ను మన్నించితివి
మొదటి ప్రేమ కోల్పోయిన
లోకాన్ని ఆశించి నిను విడచిన
నీ కరములు చాచితివి
నీ చెంతకు చేర్చుకొంటివి
నీ ప్రేమ నాపై తరగనిది
నీ కృప నన్ను విడువనిది
నిన్నే కీర్తించెద
నిన్నే స్తుతించెద
నిన్నే స్మరించెద జీవితకాలమంత
నిన్నే పూజించెద
నిన్నే హెచ్చించెద
నిన్నే నిన్నే సేవించెదను
ఆత్మకు ప్రతికూలమైన
శరీర క్రియలు వాంఛించినా
నీ వాక్యమునకు దూరమై
దురాశలు వెంటాడినా
శుద్ధాత్మను తోడుగనిచ్చి
నన్ను ఆత్మఫలముతో నింపితివి
ప్రేమలేని జీవితముతో
మ్రోగెడు కంచువలె నేనుండినా
కృపావరములులెన్నో కలిగుండినా
గణగణలాడు తాళమునైయుండగా
విశ్వాస నిరీక్షణ ప్రేమలు
నా హృదయములో నిలిపితివి

madhuramaina prematho nannu preminchithivi
aascharyamaina nee krupatho nannu manninchithivi
modhati prema kolpoyina
lokaanni aasinchi ninu vidachina
nee karamulu chaachithivi
nee chenthaku cherchukontivi
nee prema naapai tharaganidhi
nee krupa nannu viduvanidhi
ninne keerthincheda
ninne sthuthincheda
ninne smarincheda jeevithakaalamantha
ninne poojincheda
ninne hechincheda
ninne ninne sevinchedhanu
aathmaku prathikoolamaina
sareera kriyalu vaanchinchinaa
nee vaakyamunaku dhooramai
dhuraasalu ventaadinaa
suddhaathmanu thoduganichi
nannu aathmaphalamutho nimpithivi
premaleni jeevithamutho
mrogedu kanchuvale nenundinaa
krupaa varamululenno kaligundinaa
ganaganalaadu thaalamunai yundagaa
viswaasa nireekshana premalu
naa hrudayamulo nilipithivi


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com