• waytochurch.com logo
Song # 22284

Ninne nammukuntini oh deva నిన్నే నమ్ముకుంటిని ఓ దేవా నన్ను దాటి వెళ్ళకు నా ప్రభువా


నిన్నే నమ్ముకుంటిని ఓ దేవా - నన్ను దాటి వెళ్ళకు నా ప్రభువా
నీ కృపయందే నమ్మిక యుంచితి - నా శ్రమనుండి తప్పించుమా
నీ వెలుగు నాపై ఉదయించు దేవా - నీ త్రోవలో నన్ను నడిపించుమయ్యా

నా తండ్రి పాపములు క్షమియించు - మా - పితరుల దోషము మన్నించుమా (2)
నా అతిక్రమ మొప్పుకొనుచుంటి దేవా (2)
మము క్షమియించి రక్షించుమయ్యా (2)

ఓదార్చువారికై కనిపెట్టుచుంటిని - ఎవ్వరు లేక ఒంటరినైతిని (2)
నా దుర్గము నీవె యేసయ్యా (2)
నీ దరిచేర్చి ఓదార్చుమయ్యా (2)

శ్రమల సంకెళ్ళు పెనవేసుకున్నవి - మరణపు రోగమై బాధించుచున్నవి (2)
జీవాధారము నీవే యేసయ్యా (2)
నీ చిత్తమే మాకు జరిగించుమయ్యా(2)


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com