• waytochurch.com logo
Song # 22366

Sthuthipaadedhanu Virigina Hruditho Anudhinamu Kruthagnathatho స్తుతిపాడెదను విరిగిన హృదితొ


స్తుతిపాడెదను విరిగిన హృదితొ
అనుదినము నీకు కృతజ్ఞతతో
నాకెన్నొ మేలుల చేసిన దేవా
నిరతము చేతును నీ పాదసేవ

దాస్యములోనుండి
వెలఇచ్చి విడిపించ
నీ సుతునిగ నాకు
విలువను కలిగించ
పరలోకము వీడి రిక్తునిగా మారి
దాసుని రూపుతొ ఈ ధరణికి చేరి
కరుణ చూపిన దేవా
చేతును నీపాద సేవా

మంటిపురుగునైన
నను మహిమకు చేర్చ
నా దేహమును నీరూపుకు మార్చ
సశరీరుడుగా ఈ భువికేతెంచి
నాపాపముకై సిలువలొ మరణించి
తిరిగిలేచిన దేవా
చేతును నీపాద సేవా


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com