• waytochurch.com logo
Song # 22459

dhyaaninchuchuntimi siluvapai palikina viluvaina nee maatalu ధ్యానించుచుంటిమి సిలువపై పలికిన విలువైన నీ మాటలు


ధ్యానించుచుంటిమి సిలువపై పలికిన – విలువైన నీ మాటలు
ప్రాణాత్మలను సేదదీర్చు జీవ ఊటలు (2)
మోక్షమునకు చేర్చు బాటలు
పరిశుద్ధతలో పరిపూర్ణుడా – ఉన్నత గుణ సంపన్నుడా (2)
శ్రేష్టుడా… ||ధ్యానించుచుంటిమి||

తండ్రి వీరేమి చేయుచున్నారో ఎరుగరు
వీరిని దయతో క్షమించుము (2)
అని ప్రార్ధన చేసావా బాధించే వారికి (2)
శత్రువులను ప్రేమించుట నేర్పుటకై (2) ||పరిశుద్ధతలో||

నేడే నాతోను పరదైసులో నీవుందువు
నిశ్చయముగ ప్రవేశింతువు (2)
అని మాట ఇచ్చావా దొంగ వైపు చూచి (2)
అధికారముతో పాపిని రక్షించి (2) ||పరిశుద్ధతలో||

ఇదిగో నీ తల్లి ఇతడే నీ కుమారుడు
కష్టము రానీయకు ఎప్పుడు (2)
అని శిష్యునికిచ్చావా అమ్మ బాధ్యతను (2)
తెలియజేయ కుటుంబ ప్రాధాన్యతను (2) ||పరిశుద్ధతలో||

దేవా నా దేవా నను విడనాడితివెందుకు
చెవినీయవె నా ప్రార్థనకు (2)
అని కేక వేసావా శిక్షననుభవిస్తూ (2)
పరలోక మార్గం సిద్ధము చేస్తూ (2) ||పరిశుద్ధతలో||

సర్వ సృష్టికర్తను నే దప్పిగొనుచుంటిని
వాక్యము నెరవేర్చుచుంటిని (2)
అని సత్యము తెలిపావా కన్నులు తెరచుటకు (2)
జీవ జలమును అనుగ్రహించుటకు (2) ||పరిశుద్ధతలో||

సమాప్తిమయ్యింది లోక విమోచన కార్యం
నెరవేరెను ఘన సంకల్పం (2)
అని ప్రకటన చేసావా కల్వరి గిరి నుంచి (2)
పని ముగించి నీ తండ్రిని ఘనపరచి (2) ||పరిశుద్ధతలో||

నా ఆత్మను నీ చేతికి అప్పగించుచుంటిని
నీ యొద్దకు వచ్చుచుంటిని (2)
అని విన్నవించావా విధేయత తోటి (2)
తల వంచి తృప్తిగ విజయము చాటి (2) ||పరిశుద్ధతలో||

dhyaaninchuchuntimi siluvapai palikina – viluvaina nee maatalu
praanaathmalanu sedadeerchu jeeva ootalu (2)
mokshamunaku cherchu baatalu
parishuddhathalo paripoornudaa – unnatha guna sampannudaa (2)
sreshtudaa… ||dhyaaninchuchuntimi||

thandri veeremi cheyuchunnaaro erugaru
veerini dayatho kshaminchumu (2)
ani praardhana chesaavaa baadhinche vaarikai (2)
shathruvulanu preminchuta nerputakai (2) ||parishuddhathalo||

nede naathonu paradaisulo neevunduvu
nischayamuga praveshinthuvu (2)
ani maata ichchaavaa donga vaipu choochi (2)
adhikaaramutho paapini rakshinchi (2) ||parishuddhathalo||

idigo nee thalli ithade nee kumaarudu
kashtamu raaneeyaku eppudu (2)
ani shishyunikichchaavaa amma baadhyathanu (2)
theliyajeya kutumba praadhaanyathanu (2) ||parishuddhathalo||

devaa naa devaa nanu vidanaadithivenduku
chevineeyave naa praardhanaku (2)
ani keka vesaavaa shikshananubhavisthu (2)
paraloka maargam siddhamu chesthu (2) ||parishuddhathalo||

sarva srushtikarthanu ne dappigonuchuntini
vaakyamu neraverchuchuntini (2)
ani sathyamu thelipaavaa kannulu therachutaku (2)
jeeva jalamunu anugrahinchutaku (2) ||parishuddhathalo||

samaapthmayyindi loka vimochana kaaryam
neraverenu ghana sankalpam (2)
ani prakatana chesaavaa kalvari giri nunchi (2)
pani muginchi nee thandrini ghanaparachi (2) ||parishuddhathalo||

naa aathmanu nee chethiki appaginchuchuntini
nee yoddaku vachchuchuntini (2)
ani vinnavinchaavaa vidheyatha thoti (2)
thala vanchi thrupthiga vijayamu chaati (2) ||parishuddhathalo||


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com