nee vaakyame shrama kolimilo నీ వాక్యమే శ్రమ కొలిమిలో
నీ వాక్యమే శ్రమ కొలిమిలో
నను బ్రతికించుచున్నది (2)
నా బాధలో అది బహు నెమ్మది
కలిగించుచున్నది (2) ||నీ వాక్యమే||
శ్రమయందు నాకు నీ ధర్మశాస్త్రము
సంతోషమీయని యెడల (2)
బహు కాలము క్రితమే నేను – నశియించియుందునయ్యా
నీ ఆజ్ఞలను బట్టి ఆనందింతున్ (2) ప్రభు ||నీ వాక్యమే||
నీ శాసనములే ఆలోచన-
కర్తలై నన్ను నడుపుట వలన (2)
నా శత్రువుల మించిన జ్ఞానము – నాకిలను కలిగెనయ్యా
నీ ఆజ్ఞలను నేను తలదాల్తును (2) ప్రభు ||నీ వాక్యమే||
వేలాది వెండి బంగారు నాణెముల
విస్తార ధన నిధి కన్నా (2)
నీ ధర్మశాస్త్రము యెంతో – విలువైన నిధి ప్రభువా
నీ ఆజ్ఞలను బట్టి నిను పొగడడం (2) ప్రభు ||నీ వాక్యమే||
nee vaakyame shrama kolimilo
nanu brathikinchuchunnadi (2)
naa baadhalo adi bahu nemmadi
kaliginchuchunnadi (2) ||nee vaakyame||
shramayandu naaku nee dharmashaashtramu
santhoshameeyani yedala (2)
bahu kaalamu krithame nenu – nashiyinchiyundunayyaa
nee aagnalanu batti aanandinthun (2) prabhu ||nee vaakyame||
nee shaasanamule aalochana-
karthalai nannu naduputa valana (2)
naa shathruvula minchina gnaanamu – naakilanu kaligenayyaa
nee aagnalanu nenu thaladaalthunu (2) prabhu ||nee vaakyame||
velaadi vendi bangaaru naanemula
visthaara dhana nidhi kannaa (2)
nee dharmashaasthrame yentho – viluvaina nidhi prabhuvaa
nee aagnalanu batti ninu pogadedan (2) prabhu ||nee vaakyame||