naa jeevam naa sarvam neeve devaa నా జీవం నా సర్వం నీవే దేవా
Chorus:
నా జీవం నా సర్వం నీవే దేవా
నా కొరకే బలి అయిన గొర్రెపిల్ల
నా కొరకే రానున్న ఓ మెస్సయ్యా
Verse 1:
తప్పిపోయిన నన్ను వెదకి రక్షించి
మంచి కాపరి నాకై ప్రాణమిచ్చితివే
ఏమివ్వగలను నీ ఎనలేని ప్రేమకై
విరిగి నలిగిన హృదయమే నేనర్పింతును
Verse 2:
మరణము జయించి తిరిగి లేచితివి
నాకు తోడుగా పరిశుద్ధాత్మ నిచ్చితివి
అపురూప ప్రేమకై నీ సాక్షినై నిలిచెదన్
బుధిగంతము వరకు నే ప్రకటించెదన్
Tag:
నీవే నీవే నీవే దేవా