• waytochurch.com logo
Song # 22540

priya yesu dehamulo ubike rakthapu oota ప్రియ యేసు దేహములో ఉబికే రక్తపు ఊట


పాట రచయిత: సీయోను గీతాలు

ప్రియ యేసు దేహములో ఉబికే రక్తపు ఊట
ప్రవహించె ఏరులై కలుషంబులను కడుగా

కొరడాల దెబ్బలచే – దేహము చారలై చీలగా
సుందరుండు వికారుడాయే – చూడనొల్లని వాడాయే ||ప్రియ యేసు||

నా దుష్ట తలంపులకై – ముండ్ల కిరీటమా తలపై
నా నీచ నడతలకై – పాద హస్తములలో చీలలా ||ప్రియ యేసు||

ముఖముపై గ్రుద్దిననూ – చెంపలపై కొట్టిననూ
బల్లెము ప్రక్కలో దింపినా – నీచునికి నిత్య జీవమా ||ప్రియ యేసు||

ఇది ఎంతటి ప్రేమ ప్రభు – ఏమని వర్ణింతు నిన్ను
సజీవ యాగముగా – నన్నే నీ-కర్పింతును

lyricist: songs of zion

priya yesu dehamulo ubike rakthapu oota
pravahinche erulai kalushambulanu kadugaa

koradaala debbalache – dehamu chaaralai cheelagaa
sundarundu vikaarudaaye – choodanollani vaadaaye ||priya yesu||

naa dushta thalampulakai – mundla kireetamaa thalapai
naa neecha nadathalakai – paada hasthamulalo cheelalaa ||priya yesu||

mukhamupai gruddinanu – chempalapai kottinanu
ballemu prakkalo dimpinaa – neechuniki nithya jeevamaa ||priya yesu||

idi enthati prema prabhu – emani varninthu ninnu
sajeeva yaagamugaa – nanne nee-karpinthunu


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com