gaayapadina nee cheyi chaapumu devaa గాయపడిన నీ చేయి చాపుము దేవా
గాయపడిన నీ చేయి చాపుము దేవా
నీ సిలువ రక్తమును ప్రోక్షించుము నా ప్రభువా (2)
సిలువే నాకు విలువైనది (2)
అదియే నా బ్రతుకున గమ్యమైనది
ఎంతో రమ్యమైనది ||గాయపడిన||
ఎండిన భూమిలో మొలచిన లేత
మొక్క వలె నీవు ఎదిగితివి (2)
సురూపమైనా ఏ సొగసైనా (2)
లేనివానిగా నాకై మారితివి ||గాయపడిన||
మనుషులందరు చూడనొల్లని
రూపముగా నాకై మారితివి (2)
మా రోగములు మా వ్యసనములు (2)
నిశ్చయముగా నీవు భరియించితివి ||గాయపడిన||
నీవు పొందిన దెబ్బల వలన
స్వస్థత నాకు కలిగినది (2)
నీవు కార్చిన రక్తమే (2)
మా అందరికీ ఇల ప్రాణాధారము ||గాయపడిన||
gaayapadina nee cheyi chaapumu devaa
nee siluva rakthamunu proskhinchumu naa prabhuvaa (2)
siluve naaku viluvainadi (2)
adiye naa brathukuna gamyamainadi
entho ramyamainadi ||gaayapadina||
endina bhoomilo molachina letha
mokkavale neevu edigithivi (2)
suroopamainaa ae sogasainaa (2)
lenivaanigaa naakai maarithivi ||gaayapadina||
manushulandru choodanollani
roopamugaa naakai maarithivi (2)
maa rogamulu maa vyasanamulu (2)
nischayamugaa neevu bhariyinchithivi ||gaayapadina||
neevu pondina debbala valana
swasthatha naaku kaliginadi (2)
neevu kaarchina rakthame (2)
maa andariki ila praanaadhaaramu ||gaayapadina||