• waytochurch.com logo
Song # 22654

yesayya nee prema naa sonthamu naalona palikina sthuthi geethamu యేసయ్య నీ ప్రేమ నా సొంతము నాలోన పలికిన స్తుతిగీతము


యేసయ్య నీ ప్రేమ నా సొంతము – నాలోన పలికిన స్తుతిగీతము
యేసయ్య నీవేగా తొలికిరణము – నాలోన వెలిగిన రవికిరణము
ఏనాడు ఆరని నా దీపము – నా జీవితానికి ఆధారము
ఇమ్మానుయేలుగా నీ స్నేహము – నాలోన నిత్యము ఒక సంబరం ||యేసయ్య||

ఏపాటి నన్ను ప్రేమించినావు – నీ ప్రేమలోనే నను దాచినావు
నా భారమంతా నువు మోసినావు – నన్నెంతగానో హెచ్చించినావు
నీ కృపలోనే నను కాచినావు – నీ కనికరమే చూపించినావు
నా హృదిలోనే నీ వాక్యధ్యానం – నా మదిలోనే నీ నామస్మరణం
నిన్నే ఆరాధించి – నీ దయలో నే జీవించి
నిన్నే నే పూజించి – నీలో నే తరియించీ ||యేసయ్య||

ఏనాడు నన్ను విడనాడలేదు – నీ నీడలోనే నడిపించినావు
లోకాలనేలే రారాజు నీవే – నా జీవనావకు రహదారి నీవే
నా గురి నీవే నా యేసుదేవా – చేరితి నిన్నే నా ప్రాణనాథా
పర్వత శిఖరం నీ మహిమ ద్వారం – ఉన్నతమైనది నీ దివ్య చరితం
సాటే లేరు నీకు – సర్వాధికారివి నీవు
మారని దైవం నీవు – మహిమోన్నతుడవు నీవు ||యేసయ్య||

yesayya nee prema naa sonthamu – naalona palikina sthuthi geethamu
yesayya neevegaa tholi kiranamu – naalona veligina ravi kiranamu
aenaadu aarani naa deepamu – naa jeevithaaniki aadhaaramu
immaanuyelugaa nee snehamu – naalona nithyamu oka sambaram ||yesayya||

aepaati nannu preminchinaavu – nee premalone nanu daachinaavu
naa bhaaramanthaa nuvu mosinaavu – nannenthagaano hechchinchinaavu
nee krupalone nanu kaachinaavu – nee kanikarame choopinchinaavu
naa hrudilone nee vaakya dhyaanam – naa madilone nee naama smaranam
ninne aaraadhinchi – nee dayalo ne jeevinchi
ninne ne poojinchi – neelone thariyinchi ||yesayya||

aenaadu nannu vidanaadaledu – nee needalone nadipinchinaavu
lokaalanele raaraaju neeve – naa jeeva naavaku rahadaari neeve
naa guri neeve naa yesu devaa – cherithi ninne naa praana naathaa
parvatha shikharam nee mahima dwaaram – unnathamainadi nee divya charitham
saate leru neeku – sarvaadhikaarivi neevu
maarani daivam neevu – mahimonnathudavu neevu ||yesayya||


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com