Dhevuni Sevakulaara prabhu yesuni yaajakulaaraa దేవుని సేవకులరా ప్రభుయేసుని యాజకులరా
దేవుని సేవకులరా ప్రభుయేసుని యాజకులరా
జీవితమును పరిచర్యలో కరిగించుచున్న ఘనులారా
ఆత్మల సాధన దీక్షలో తరియించుచున్న ప్రియులారా
ఉన్నతపనికై నియమితులైన ధన్యులు మీరే కారా
మీరు చూపిన త్యాగం మాకు స్ఫూర్తిదాయకం
మీకు వందనం మీకై ప్రార్థిస్తున్నాం
నిందలపాలవుతున్నా మౌనంగా భరియిస్తూ
గుండెలు నీరవుతున్నా పయనం కొనసాగిస్తూ
అందరి బాధలు పంచుకొని నిత్యం ప్రార్థిస్తూ
సంఘపు క్షేమం కోరుకొని సత్యం బోధిస్తూ
మందను కాచే కాపరులారా
దేహము పాడవుతున్నా ధైర్యముగా పయనిస్తూ
ఫలితం చేదవుతున్నా చిరునవ్వుతో కనిపిస్తూ
అంకితభావం పెంచుకొని సాక్షిగా జీవిస్తూ
స్వార్ధపు ఆశలు చంపుకొని నియమం పాటిస్తూ
భారము మోసే శ్రామికులారా
హింసలు ఎదురవుతున్నా శుభవార్తను ప్రకటిస్తూ
సాయము కరువవుతున్నా వరములు ఉపయోగిస్తూ
జీవపువాక్యం పట్టుకొని తప్పును ఖండిస్తూ
క్రీస్తునిసిలువను ఎత్తుకొని మాదిరి చూపిస్తూ
మార్గము చూపే భోధకులారా
dhevuni sevakulaara prabhu yesuni yaajakulaaraa
jeevithamunu paricharyalo kariginchuchunna ghanulaara
aathmala saadhana dheekshalo thariyinchuchunna priyulaaraa
unnatha panikai niyamithulaina dhanyulu meere kaaraa
meeru choopina thyaagam maaku spoorthidhaayakam
meeku vandhanam meekai praardhisthunnaam
nindhala paalavuthunnaa mounamgaa bhariyisthu
gundelu neeravuthunaa payanam konasaagisthu
andhari bhaadhalu panchukoni nithyam praardhisthu
sanghapu kshemam korukoni sathyam bhodhisthu
mandhanu kaache kaaparulaaraa
dhehamu paadavuthunnaa dhairyamugaa payanisthu
phalitham chedhavuthunnaa chirunavvutho kanipisthu
ankitha bhaavam penchukoni saakshiga jeevisthu
swaardhapu aasalu champukoni niyamam paatisthu
bhaaram mosey sraamikulaaraa
himsalu edhurauthunnaa shubhavaarthanu prakatisthu
saayamu karuvavuthunna varamulu upayogisthu
jeevapu vaakyam pattukoni thappunu khandisthu
kreesthuni siluvanu ethukoni maadhiri choopisthu
maargamu choope bhodhakulaaraa