nee challani chooputho karuninchinandhuna నీ చల్లని చూపుతో కరుణించినందున
నీ చల్లని చూపుతో కరుణించినందున
బ్రతికి ఉన్నానయా
నీ చేయి చాపి లేవనెత్తినందున
జీవించుచున్నానయా
యేసయ్యా నా మంచి యేసయ్యా
నీ కృపతో నన్ను కాపాడితివి
యేసయ్యా నా గొప్ప యేసయ్యా
నీ దయ చూపించి స్వస్థతనిచ్చితివి
నా భుజములపై చేయివేసితివి
దిగులు బెంగ వద్దని నాతో అంటివి
నీ సన్నిధి నాకు తోడుగా ఉంచితివి
నా కన్నీళ్లు ప్రతిరోజు తుడిచితివి
నీ కృపతో కనికరించి నా వ్యాధి బాధలలో
కంటి పాపగా నను కాపాడితివి
నా బలహీనతలో బలమై నిలిచితివి
చీకు చింత వద్దని నాతో అంటివి
నీ సర్వము నాకు తోడుగా ఉంచితివి
నా నిట్టూర్పులో నన్ను బలపరచితివి
నీ కృపతో ఆదరించి నా క్షామకాలంలో
మంచికాపరివై నన్ను కాపాడితివి