అందాల బాలుడు ఉదయించినాడు
andaala baaludu udayinchinaadu
అందాల బాలుడు ఉదయించినాడు
లోకాలు వెలిగించు నీతి సూరీడు (2)
రండయ్యో మన కొరకు రారాజు పుట్టెను
ప్రేమను పంచేటి రక్షణను తెచ్చెను (2)          ||అందాల||
భీతిల్లి పోయాము ఆ వెలుగునే జూసి
ఎన్నడూ ఎరుగని తేజస్సునే గాంచి (2)
గొల్లలము మేము కల్లలు ఎరుగము (2)
కళ్లారా జూసాము తేజోమయుని మోము (2)         ||రండయ్యో||
తూరుపు జ్ఞానులము వెలిగే తారను జూసి
లెక్కలెన్నో వేసి మాహరాజు-నెతికాము (2)
దారి చూపే తార రారాజునే జేర (2)
మొక్కాము మోకరిల్లి బాలున్ని మనసారా (2)         ||రండయ్యో||
తనలోని వెలుగంత పంచేటి పావనుడు
మనలోని పాపమంత తీసేయు రక్షకుడు (2)
చీకట్లు తొలగించ ఉదయించినాడు నేడు (2)
నీ తప్పులెన్ని ఉన్నా మన్నించుతాడు రేడు (2)         ||రండయ్యో||
andaala baaludu udayinchinaadu
lokaalu veliginchu neethi sooreedu (2)
randayyo mana koraku raaraaju puttenu
premanu pancheti rakshananu thecchenu (2)        ||andaala||
bheethilli poyaamu aa velugune joosi
ennadu erugani thejassune gaanchi (2)
gollalamu memu kallalu erugamu (2)
kallaaraa joosaamu thejomayuni momu (2)        ||randayyo||
thoorupu gnaanulamu velige thaaranu joosi
lekkalenno vesi maharaaju-nethikaamu (2)
daari choope thaara raahune jera (2)
mokkaamu mokarilli baalunni manasaaraa (2)        ||randayyo||
thanaloni velugantha pancheti paavanudu
manaloni paapamantha theeseyu rakshakudu (2)
cheekatlu tholagincha udayinchinaadu nedu (2)
nee thappulenni unnaa manninchuthaadu redu (2)        ||randayyo||

 WhatsApp
 WhatsApp Twitter
 Twitter