Dhivine vidachi bhuvike vachina naa yesayya ధివినే విడచి భువికే వచ్చిన నా యేసయ్య
ధివినే విడచి భువికే వచ్చిన నా యేసయ్య
ఆ ధివికే నిన్ను నన్ను చేర్చగా జన్మించాడయ్యా
తూర్పు దిక్కు చుక్క మెరిసేలే
చిన్నారి ఏసు జాడ తెలిపెలే
బెత్లహేము సంతోషించే లే
రక్షకుండు యిల జన్మించెలే
బంగారు సాంబ్రాణి భోలంబు తెచ్చామే
మనసారా బాలయేసుని స్తుతియింప వచ్చామే
ఊరంతా సంబర మాయేలే
రండి రండి పోదాము రారాజుని చూద్దాము
రండి రండి పోదాము తరియిద్దాము
ధివి నుండి దూతలు వచ్చి భయపడవద్దన్నారే
ఈ భువికి కలుగబోవు శుభవార్తను తెలిపారే
అది విన్న గొల్లలు పరుగున ఏసయ్యను చేరారే
పాటలతో నాట్యంతో ప్రభువుని కీర్తించారే
రక్షకుడు ఏసయ్యే రారాజుగా వచ్చాడే
చిన్న పెద్ద అంతా కలిసి పూజిద్దాం రారండోయ్
చిరునవ్వుల చిన్ని యేసు చిత్రంగా భువి చేరెలే
పశువుల పాకే నేడు పరలోక సన్నిధాయే
దీనుడిగా ఉదయించాడే మహిమత్వం విడిచాడే
తన ప్రేమను మనకై చూప దయతో దిగి వచ్చాడే
పరమే విడిచి నీకై నాకై నరునిగా వచ్చాడే
చీకు చింతలు పాపం పోవును పూజిద్దాం రారండోయ్
dhivine vidachi bhuvike vachina naa yesayya
aa dhivike ninnu nannu cherchagaa janminchaadayyaa
thoorpu dhikku chukka merisele
chinaari yesu jaada thelipele
bethlahemu santhoshinchele
rakshakundu ila janminchele
bangaaru saambraani bholambu thechaame
manasaaraa baala yesuni sthuthiyimpa vachaame
ooranthaa sambara maayele
randi randi podhaamu raaraajuni choddaamu
randi randi podhaamu thariyiddhaamu
dhivi nundi dhoothalu vachi bhayapada vaddannaare
ee bhuviki kalugabovu subhavaarthanu thelipaare
adhi vinna gollalu paruguna yesayyanu cheraare
paatalatho naatyamtho prabhuvuni keerthinchaare
rakshakudu yesayye raaraajugaa vachaade
chinna pedda antha kalisi poojiddham raarandoi
chirunavvula chinni yesu chitramga bhuvi cherele
pasuvula paake nedu paraloka sannidhaaye
dheenudigaa udhayinchaade mahimathvam vidichaade
thana premanu manakai choopa dhayatho dhigi vachaade
parame vidichi neekai naakai narunigaa vachaade
cheeku chinthalu paapam povunu poojiddham raarandoi