aadiyanthamu leni vaadaa sampoornudagu maa devaa ఆదియంతము లేనివాడా సంపూర్ణుడగు మా దేవా
ఆదియంతము లేనివాడా సంపూర్ణుడగు మా దేవా
నీతిజ్ఞానము కలవాడా జ్యోతికి నిలయము నీవే
అబ్రాహామును పిలిచితివి – ఆ వంశమున బుట్టితివి
అనాధులకు దిక్కు నీవే – అనాధుడవై వచ్చితివి ||ఆదియంతము||
ఇస్సాకును విడిపించి – యేసయ్యా బలియైనావా
యూదాచే నమ్మబడితివి – పాపులకై మరణించితివి ||ఆదియంతము||
యోనావలె మూడు దినముల్ – భూగర్భమున నీవుండి
మానవులను రక్షింప – మహిమతోడ లేచితివి ||ఆదియంతము||
పండ్రెండు గోత్రముల – జెంది – పండ్రెండు శిష్యుల జనకా
కన్యపుత్రుడవై సీయోను – కన్యను వరించితివి ||ఆదియంతము||
దావీదు కుమారుడవు – దావీదుకు దేవుడవు
కాపాడుచు నున్నావు – పాపిని నన్ను ప్రేమించి ||ఆదియంతము||
aadiyanthamu leni vaadaa sampoornudagu maa devaa
neethi gnaanamu kalavaadaa jyothiki nilayamu neeve
abrahaamunu pilichithivi – aa vamshamuna buttithivi
anaadhulaku dikku neeve – anaadhudavai vachchithivi ||aadiyanthamu||
issaakunu vidipinchi – yesayyaa baliyainaavaa
yoodaache nammabadithivi – paapulakai maraninchithivi ||aadiyanthamu||
yonaa vale moodu dinamul – bhoo garbhamuna neevundi
maanavulanu rakshmipa – mahima thoda lechithivi ||aadiyanthamu||
pandrendu gothramula – jendi – pandrendu shishyula janakaa
kanya puthrudavai seeyonu – kanyanu varinchithivi ||aadiyanthamu||
daaveedu kumaarudavu – daaveeduku devudavu
kaapaaduchununnaavu – paapini nannu preminchi ||aadiyanthamu||