naa naathudaa naa yullamichchithi neeku నా నాథుడా నా యుల్లమిచ్చితి నీకు
నా నాథుడా నా యుల్లమిచ్చితి నీకు (2)అన్నియు నీకై వీడి – నిన్నే వెంబడించితిని (2)పెన్నుగ నాలో నాటుమా (2) ప్రేమన్ ||నా నాథుడా||దేవాలయ విగ్రహముల్ – దేవతలు వేయిలక్షల్ (2)యావత్తు పెంటయనుచు (2) నిదిగో ||నా నాథుడా||ఆదియంత రహితుడ – ఆత్మల నాయకుడా (2)ఆశ కల్గించు నాలోన (2) నీవే ||నా నాథుడా||పరిశుద్ధ యవతరుడా – మరియు తేనె అమృతుడా (2)కరుణతో నన్ను గావుమా (2) యిప్పుడు ||నా నాథుడా||భూతలమునకు వేంచేసి – పాతకుల ప్రేమించితివి (2)పాతకుడ నేనైతిని (2) మహా ||నా నాథుడా||ఆద్యంతము లేనట్టి – బీదలకు ధన నిధీ (2)సదయుడా నన్ను చూడుమా (2) యిపుడు ||నా నాథుడా||హల్లెలూయ గీతమును – ఎల్లెడల చాటించెదను (2)ఉల్లమందానంద ధ్వని (2) యిదియే ||నా నాథుడా||