• waytochurch.com logo
Song # 2386

జీవితాంతమూ నే నీతో నడవాలని

jeevithanthamu nee neetho

జీవితాంతమూ నే నీతో నడవాలని.. ఎన్నడూ నీ చేయి నేను విడువరాదని..

నీ సన్నిధిలో నిత్యమూ నేనుండాలని.. నీ నిత్య ప్రేమలో నేను నిలవాలని..

నా మనస్సంత నీవే నిండాలని.. తీర్చుమయ్య నా ప్రభు ఈ ఒక్క కోరిక..

పడితినయ్య పడితిని నీ ప్రేమలోనే పడితిని.. యేసయ్య ఓ యేసయ్య నీ ప్రేమ ఎంత గొప్పదయ్య..

దారి తప్పి యున్న నన్ను వెదకి రక్షించినవయ్య..

నే కన్న పగటి కలలన్ని కల్లలాయెను.. నీవు లేని నా స్వనీతి వ్యర్ధమాయెను..

నరుని నమ్ముటే నాకు మోసమాయెను.. భయముతోటి నా కన్ను నిద్ర మరిచెను..

మనసులోన మానిపోని గాయమాయెను.. నీ ప్రేమ ఇచ్చే నాకు ఓ కొత్త జీవితం..

పడితినయ్య పడితిని నీ ప్రేమలోనే పడితిని.. యేసయ్య ఓ యేసయ్య నీ ప్రేమ ఎంత గొప్పదయ్య..

దారి తప్పి యున్న నన్ను వెదకి రక్షించినవయ్య..

లోక భోగాట్టాలకు నే పొంగిపోతిని.. దాని కనుసైగలోన నేను నడచుకొంటిని..

చెడ్డదైన బ్రతుకు సరిజేయ చూసితి.. ప్రయాసం వ్యర్ధమై నే నీరసిల్లితి..

ముగిసిపోయెననుకొంటి నా ప్రయాణము.. నీ ప్రేమ ఇచ్చే నాకు ఓ కొత్త జీవితం..

పడితినయ్య పడితిని నీ ప్రేమలోనే పడితిని.. యేసయ్య ఓ యేసయ్య నీ ప్రేమ ఎంత గొప్పదయ్య..

దారి తప్పి యున్న నన్ను వెదకి రక్షించినవయ్య..

Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2025 Waytochurch.com