• waytochurch.com logo
Song # 2389

naa jayamu koorina dheva నా జయము కోరిన దేవా సైన్యములకధిపతి యెహోవా

నా జయము కోరిన దేవా - సైన్యములకధిపతి యెహోవా..

నీ దండులో - నేనుండగా - నాకు ఓటమి లేదయ్యా యేసయ్యా..

నీకే నీకే నా ఆరాధనా - నీకే నీకే మహిమా ఘనతా..

నా వేదనంతయూ - ఉత్తరముపైవ్రాసి..

నీదు మందిరమందున - పరచి ప్రార్ధనచేయగా..

దూతను పంపి - దీవెనతో నింపి - మాకు జయమిచ్చితివే..

నీకే నీకే నా ఆరాధనా - నీకే నీకే మహిమా ఘనతా..

శోధన జయింపనూ - ప్రార్ధన నేర్పిన దేవా..

నీ ప్రజల నెమ్మది కోరి - ఆదరణకర్తను పంపితివి..

విశ్వాసి ప్రార్ధనకు - విశ్వముపైన - విజయమిచ్చెదనంటివే..

నీకే నీకే నా ఆరాధనా - నీకే నీకే మహిమా ఘనతా..

నా జయము కోరిన దేవా - సైన్యములకధిపతి యెహోవా..

నీ దండులో - నేనుండగా - నాకు ఓటమి లేదయ్యా యేసయ్యా..

నీకే నీకే నా ఆరాధనా - నీకే నీకే మహిమా ఘనతా..

Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com