kula pichodini nenu కుల పిచ్చోడ్ని నేను కళ్ళులేని కభోదిని
కుల పిచ్చోడ్ని నేను - కళ్ళులేని కభోదిని
మత ముచ్చోడ్ని నేను - మతేలేని ఉన్మాదిని
ప్రభుదేవా.. పరలోకరాజా - నీ రాజ్యములో నన్ను చేర్చు దేవా
నా కులం నా కళ్ళు పొడిచిందిలే - నా మతం నా మనసు విరిచిందిలే
కులమొక కల్పనయే - మతమొక మతిభ్రమయే
కుల వెలి, మత బలి - మోసం మోసమేలే
నా అంశం నా కులం తప్పిందిలే - నా వంశం నా మతం మరిచిందిలే
పుట్టుకలో లేని కులం - బ్రతుకులో ఎందుకులే
మరణంలో రాని మతం - మోక్షంలో లేదులే
కుల పిచ్చోడ్ని నేను - కళ్ళులేని కభోదిని
మత ముచ్చోడ్ని నేను - మతేలేని ఉన్మాదిని
ప్రభుదేవా.. పరలోకరాజా - నీ రాజ్యములో నన్ను చేర్చు దేవా