jeevana tholi sandya జీవన తొలి సంధ్యా.. నీతోనే ఆరంభం.
జీవన తొలి సంధ్యా.. నీతోనే ఆరంభం..
నా జీవన మలి సంధ్యా.. నీతోనే అంతము..
నా జీవన యాత్రకు మలి సంధ్యా.. ఆసన్నమౌతుంది..
నను సిద్ధపరచు యేసు నాథా.. నీతోనుండుటకు..
నా జీవన యాత్రలో.. ఎన్నో అవరోధాలు..
నా జీవన గమనంలో.. ఎన్నో అవమానాలు..
నిరీక్షణలేని ఇతరులవోలె.. దుఖించను నేను..
నా భారము నీపై మోపి ముందుకు.. సాగుతున్నాను..
దేవా.. నీవే.. నా ఆశ్రయదుర్గము..
నా పూర్వీకులెందరో.. ఎపుడో గతించారు..
ఏదో ఒకరోజున.. నా యాత్ర ముగించెదను..
నా శేష జీవితమంతయు నీకే.. అర్పించితినయ్య..
నా వేష బాషయులన్నియు నీకే.. సమర్పింతును దేవా..
దేవా.. నను నీ.. సాక్షిగా నిల్పుమా..