nenante nee kendhuko నేనంటే నీకెందుకో.. ఈ ప్రేమ.. నన్ను మరచిపోవెందుకో.
నేనంటే నీకెందుకో.. ఈ ప్రేమ.. నన్ను మరచిపోవెందుకో..
నా ఊసే నీకెందుకో.. ఓ యేసయ్యా.. నన్ను విడిచిపోవెందుకో..
కష్టాలలో.. నష్టాలలో.. వ్యాధులలో.. బాధలలో..
కన్నీళ్లలో.. కడగళ్లలో.. వేదనలో.. శోధనలో..
నా ప్రాణమైనావు నీవు.. ప్రాణమా.. నా ప్రాణమా..
నిన్ను మరచిపోయినా.. నన్ను మరచిపోలేవు..
నిన్ను విడిచివెళ్లినా.. నన్ను వీడిపోలేవు..
ఎందుకింతప్రేమ నాపై యేసయ్యా.. ఎందుకింతప్రేమ నాపై యేసయ్యా..
ఏ ఋణమో.. ఈ బంధమూ.. నా ప్రేమమూర్తి.. తాళలేను నీ ప్రేమను..
ప్రార్ధించకపోయినా.. పలకరిస్తూ ఉంటావు..
మాట వినకపోయినా.. కలవరిస్తూ ఉంటావు..
ఎందుకింత జాలి నాపై యేసయ్యా.. ఎందుకింత జాలి నాపై యేసయ్యా..
ఏ ఫలమో.. ఈ బంధమూ.. నా ప్రేమమూర్తి.. తాళలేను నీ ప్రేమను..