naa praanamaa yehovaanu neevu sannuthinchumu నా ప్రాణమా యెహోవాను నీవు సన్నుతించుము
నా ప్రాణమా యెహోవాను నీవు సన్నుతించుము నీ ప్రభు చేసిన మేలులలో ఒక్కదానినైన నీవు మరువకు (2)అనుదినము ధ్యానించుచు కృతజ్ఞతార్పనలు చెల్లించుము (2)పాపపు ఊభిలో నీవు మునిగియుండనేల నీ దోషములను క్షమియించి లేవనెత్తును సమాధిలోన నీవు విసిగియున్న వేళ నిను విమోచించి కరుణ కటాక్షముల నిచ్చును (2)పక్షిరాజు యవ్వనమును దయచేసి మేళ్ళతో నీ హృదయము తృప్తి పరచును యేసు నామములోనే నీకు రక్షణ యేసు నామములోనే నీకు స్వస్థత యేసు నామములోనే నీకు నెమ్మది యేసు నామములోనే నిలుపు నీ మది ||నా ప్రాణమా||కొండల తట్టు నీ కన్నులెత్తుము నీ సహాయము దయచేయు దేవుడు ఇరు వైపులా శత్రువు తరుముచున్ననూ ఏ అపాయము దరికి చేరనీయడు (2)విశ్వాస కవచమును ధరించుము విజయ వీరుడవై ముందుకేగుము యేసు నామములోనే నీకు విడుదల యేసు నామములోనే నీకు క్షేమము యేసు నామములోనే నీకు విజయము యేసు నామములోనే నిత్యజీవము ||నా ప్రాణమా||
Naa Praanamaa Yehovaanu Neevu Sannuthinchumu Nee Prabhu Chesina Melulalo Okkadaaninaina Neevu Maruvaku (2) Anudinamu Dhyaaninchuchu Kruthagnathaarpanalu Chellinchumu (2)Paapapu Oobhilo Neevu Munigiyunda Nela Nee Doshamulanu Kshamyinchi Levanethunu Samaadhilona Neevu Visigiyunna Vela Ninu Vimochinchi Karuna Kataakshamula Nichchunu (2) Pakshi Raju Yavvanamunu Dayachesi Mellatho Nee Hrudayamu Thrupthi Parachunu Yesu Naamamulone Neeku Rakshana Yesu Naamamulone Neeku Swasthatha Yesu Naamamulone Neeku Nemmadi Yesu Naamamulone Nilupu Nee Madi ||Naa Praanamaa||Kondala Thattu Nee Kannuleththumu Nee Sahaayamu Dayacheyu Devudu Iru Vaipula Shathruvu Tharumuchunnanuu Ae Apaayamu Dariki Cheraneeyadu (2) Vishwaasa Kavachamunu Dharinchumu Vijaya Veerudavai Mundukegumu Yesu Naamamulone Neeku Vidudala Yesu Naamamulone Neeku Kshemamu Yesu Naamamulone Neeku Vijayamu Yesu Naamamulone NithyaJeevamu ||Naa Praanamaa||