priyudaa nee prema ప్రియుడా నీ ప్రేమ – పాదముల్ చేరితి
1. ప్రియుడా నీ ప్రేమ – పాదముల్ చేరితి - నెమ్మది నెమ్మదియే
ఆసక్తితో నిన్ను పాడి స్తుతించెద ఆనందం - ఆనందమే
అద్భుతమే ఆశ్చర్యమే – ఆరాధనా ఆరాధనా (2)
2. నీ శక్తి కార్యముల్ తలంచి తలంచి - ఉల్లము పొంగెనయ్యా
మంచివాడా మంచి చేయువాడా - స్తోత్రము స్తోత్రమయా
మంచివాడా మహోన్నతుడా - ఆరాధనా ఆరాధనా (2)
3. బలియైన గొఱ్ఱెగా - పాపములన్నిటిని మోసి తీర్చితివే
పరిశుద్ద రక్తము నా కొరకేనయ్యా – నాకెంతో భాగ్యమయ్యా
పరిశుద్దుడా - పరమాత్ముడా - ఆరాధనా ఆరాధనా
4. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చినా - నిన్ను నేవిడవనయ్యా
రక్తము చిందిన సాక్షిగా యుందున్ - నిశ్చయం నిశ్చయమే
రక్షకుడా - యేసునాధా - ఆరాధనా ఆరాధనా