neevu chesina vupakaaramulaku నీవుచేసిన ఉపకారములకు నేనేమి చేల్లింతును
నీవుచేసిన ఉపకారములకు - నేనేమి చేల్లింతును
ఏడాది దూడలనా? వేలది పొట్టేళ్ళనా?
వేలాది నదులంత విస్తారతైలము -నీకిచ్చినచాలునా?
గర్భఫలమైన నా జ్యేష్ఠపుత్రుని -నీకిచ్చినచాలునా
ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందున -నేనేమి చెల్లింతును?
కపట వర్తన లేకున్న హృదయాన్ని -అర్పించుటే చాలునా?
మరణ పాత్రుడనైయున్న నాకై - మరణించితివ సిల్వలో
కరుణ చూపి నీ జీవమార్గాన - నడిపించుమో యేసయ్యా
విరిగి నలిగిన బలియాగముగను - నా హృదయమర్పింతును
రక్షణ పాత్రను చేబూని నిత్యము -నిను వెంబడించెదను