halleluah ani paadi హల్లెలుయా యని పాడి స్తుతింపని రారే
హల్లెలుయా యని పాడి స్తుతింపని రారే జనులార మనసార ఊరూరా రారే జనులార ఊరూరా మనసార
పాడి పంటల నిచ్చి పాలించు దేవుడని కూడు గుద్దలనిచ్చు పోషించు దేవుడని తోడు నీడగా నిన్ను కాపాడు నాదుడని పూజించి...పూజించి పాటించి చాటించ రారే
బంధు మిత్రులకన్నా బలమైన దేవుడని అన్నదమ్ములకన్న ప్రియమైన దేవుడని కన్నా బిడ్డలకన్న కన్నుల పండుగని పూజించి...పూజించి పాటించి చాటించ రారే
తాత ముత్తతలకన్న ముందున్న దేవుడని తల్లి దండ్రులకన్న ప్రేమించు దేవుడని కల్లా కపటములేని కరుణ సంపన్నుడని పూజించి...పూజించి పాటించి చాటించ రారే
రాజాధి రాజుకన్నా రాజైన దేవుడని నీచాతి నీచులను ప్రేమించి వచేనని నిన్న నేడు ఏక రీతిగా ఉన్నాడని పూజించి...పూజించి పాటించి చాటించ రారే