గాఢాంధ కారములో నే నడిచిన వేళలలో
gaadandhakaaramulo nee nadachina
గాఢాంధ కారములో నే నడిచిన వేళలలో
కంటి పాపవలె నన్ను కునుకాక కాపడును
ప్రభువైన యేసునకు జీవితమంత పాడెదన్
జడియను బెదరను నా యేసు నాతో నుండగా
మరణపు లోయలలో నే నడచిన వేళలలో
నే దుడ్దు కర్రయు నీ దండము ఆదరించును
శుధాత్మతో నింపును నా గిన్నె పొర్లు చున్నది
జడియను బెదరను నా యేసు నాతో నుండగా
అలలతో కొట్టబడినా నా నావలో నేనుండగా
ప్రభు యేసు క్రుప నన్ను విడువక కాపాడును
అభయమిచ్చి నన్ను అద్దరికి చేర్చును
జడియను బెదరను నా యేసు నాతో నుండగా
పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లినను
నీ క్రుప నను విడువదు నీ కనికరం తొలగదు
నీ నిత్య సమాధానంతో నన్ను నడిపించును
జడియను బెదరను నా యేసు నాతో నుండగా