మహోన్నతుడా నీ క్రుపలో నేను నివసించుట
mahonathuda nee krupalone
మహోన్నతుడా నీ క్రుపలో నేను నివసించుట || 2 ||
నా జీవిత ధన్యతై యున్నది || 2 ||
మోడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు
మారా అనుభవం మధురముగా మార్చ గలవు నీవు
ఆకు వాడక ఆత్మ ఫలములు ఆనందముతో ఫలిఇంపనూ
జీవ జలముల ఊటఐన నీ ఓరను నను నాటితివా
వాడ బారని స్వాస్థ్యము నాకై పరమందు దాచియుంచితివా
వాగ్ధాన ఫలము అనుభవింప నీ క్రుపతో నన్ను పిలచితివా