pampumu dheeva పంపుము దేవా దీవెనలతో
పంపుము దేవా దీవెనలతో
పంపుము దేవా
పంపుము దయచేత
పతిత పావన నామ
పెంపుగ నీ సేవ
బ్రియ మొప్ప నొనరింప
పంపుము దేవా దీవెనలతో
పంపుము దేవా
మా సేవనుండిన మా వెల్తులన్నియు
యేసుని కొరకు నీ వెసగ క్షమియించును
వినిన సత్యంబును విమలాత్మ మది నిల్పి
దిన దినము ఫలములు దివ్యముగ ఫలియింప
ఆసక్తితో నిన్ననిశము సేవింప భాసురం బగు
నాత్మ వాసికెక్కగనిచ్చి