siluvalo bhaliaina సిలువలో బలియైన దేవుని గొర్రెపిల్ల
సిలువలో బలియైన దేవుని గొర్రెపిల్ల
విలువైన నీ ప్రేమన్ వివరింతు శ్రీయేసు
నా యతిక్రమములకై నలుగగొట్టబడి
నా దోషముల నీవు ప్రియముగను మోసితివా ||సిలువలో||
నా రోగముల నీపై నమ్రతతో భరియించి
త్రుణీకరింపబడి ప్రాణమర్పించితివి ||సిలువలో||
వ్యసనాక్రాంతుడవుగా వ్యాధిననుభవించి
మౌనము ధరించి మరణమైతివా ప్రభువా ||సిలువలో ||
పరమున కెత్తబడిన ప్రియ యేసురాకడకై
పదిలముగ కనిపెట్టి పాడెదను హల్లెలూయ ||సిలువలో ||