enaleni prema naaki ఎనలేని ప్రేమ నాపైన చూపి
ఎనలేని ప్రేమ నాపైన చూపి - నీ వారసునిగా చేసినావు..
నీ ప్రేమ నేను చాటెదన్ - నా సర్వం నీవే యేసయ్యా..
నా శిక్షకు ప్రతిగా - ప్రాణము పెట్టిన దేవా..
నీ సత్య మార్గములో - నను నడిపిన ప్రభువా..
నీ కృపచేత రక్షించినావే - నీ ఋణము నే తీర్చగలనా..
తండ్రిలేని నాకు - పరమతండ్రివి నీవై..
ఒంటరినైయున్న నాతో - నేనున్నా అని అన్నావు..
కన్నీరు తుడిచి నన్నాదరించిన - ఆ జాలి నే మరువగలనా..