kanugontini ninne o najareya కనుగొంటిని నిన్నే ఓ నజరేయా
కనుగొంటిని నిన్నే ఓ నజరేయా - సమర్థుడవని సహాయము చేయ..
నీ ప్రభావము - నాలోకి చేరగా - నా స్వరూపమూ - మారిపోయెగా..
1. ప్రయత్నాలు చేసి వేసారియుంటిని - ఉన్న ఆస్తినంతా చేజార్చుకొంటిని..
వైద్యులచుట్టూ - కాళ్లు అరిగేటట్టు - ఎంతతిరిగినా - సరికాక యుంటిని..
2. స్వంతజనులతోనే వెలివేయబడితిని - అపనిందలపాలై మతిపోయి చెడితిని..
బ్రతుకెందుకని - మనసే చంపుకుని - జీవశ్చవమై - ఇల మిగిలియుంటిని..
3. నీ మహిమను గూర్చి వార్తలను వింటిని - స్వస్తపరచు దేవా నిను నమ్ముకొంటిని..
ధైర్యములేక - ఎదురుగ రాలేక - వెనుకనుండి వచ్చి నిను ముట్టుకుంటిని..