anantha gnani అనంత జ్ఞాని నీకు అల్పుడను నాకు సహవాసమా
అనంత జ్ఞాని నీకు - అల్పుడను నాకు సహవాసమా!
మహిమాన్విత నీకు - మట్టినైన నాకు స్నేహమా!
కృపా ఇది నీ కృప కృపా నీ కృప కేవలం నీ కృప కేవలం నీ కృప
కృప కృప కృప కృప కృప [ అనంత]
1. కోట్లాది జనులలో గుర్తించావు - కోరుకుని నీ ప్రజగా లేక్కిన్చావు
క్షమించే మనసు కల్గి - ఫలించే జీవమిచ్చి
పరలోక పౌరునిగా నను చేశావు నను చేశావు [ కృప ]
2. అప్పగించుకున్నాను నీ కృప కే నేను
గొప్ప దేవుడా నీ సన్నిదిలో ఉన్నాను (2)
పిలిచినవాడా నన్ను గెలిచినవాడా (2)
ప్రేమించి ప్రేరేపించి స్థిరపరచినవాడ [కృప ] [అనంత]