aanandhinthunu neelo dheva ఆనందింతును నీలో దేవ అనుదినం నిన్ను స్తుతించుచు
ఆనందింతును నీలో దేవ - అనుదినం నిన్ను స్తుతించుచు
మధురమైన నీ నామమునే మరువజాలక కొలిచెద ప్రభువా
1. ఆత్మనాదా - అదృశ్య దేవా - అఖిల చరాలకు ఆధారుండా
అనయము నినుమది కొనియాడుచునే - ఆనందిన్తు నీ పాదసేవ
2. నాదు జనములు నను విడిచినాను - నన్ను నీవు విడువకుండ
నీ కను దృష్టి నాపై నుంచి - నాకు రక్షణ శృంగమైన
3. శ్రేష్టమగు నీ దాసుల కొరకు - లోకమందు రానై యున్న
ఆ ఘడియ ఎపుడో నీకే తెలుసు అంత వరకు భద్ర పరచు
4. శ్రమలు నన్ను చుట్టిన వెళ్ళ - చింతలో కృశించిన వేళ
అభాయముగా నీ దర్శనమిచ్చి - శ్రమలు బాపి శాంతినిచ్చి