ఎగురుచున్నది విజయపతాకం
eguruchunnadhi vijayapathaakam
పల్లవి : ఎగురుచున్నది విజయపతాకం
ఏసు రక్తమే మా జీవిత విజయం
రోగ దుఃఖ వ్యసనములను తీసివేయును
సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చును
రక్తమే - రక్తమే - రక్తమే - యేసు రక్తమే
రక్తమే జయం - యేసు రక్తమే జయం
1. యేసుని నామము నుచ్చ రింపగానే
సాతాను సైన్యము వనుకుచున్నది
వ్యాదుల బలము నిర్మూలమైనది
జయమొండేది నామము నమ్మినప్పుడే (రక్తమే)
2. దయ్యపు కార్యాలను గెలిచిన రక్తం
ఎడతెగకుండగా మనము స్మరణ చేయుదం
పాపపు క్రియలన్నిటిని చెదరగోట్టిన
క్రీస్తుని సిలువను మనము అనుసరించేదం (రక్తమే)
3. మా ప్రేమ వైద్యుడ ప్రాణ నాధుడా
ప్రీతి తోడ నీ హస్తము చాపుము దేవా
నీ పాద పద్మముపై చేరియున్న ప్రజలను
స్వస్త పరచుము తండ్రి ఈ క్షణమందే (రక్తమే)