• waytochurch.com logo
Song # 2429

endhuko nannu neevu ennukunnavu ఎందుకో నన్ను నీవు ఎన్నుకున్నావు



ఎందుకో నన్ను నీవు ఎన్నుకున్నావు

ఏ మంచిలేని నన్ను నీవు కోరుకున్నావు

ఆ ప్రేమకు ఫలితము సిలువ త్యాగమా

ఆ ప్రేమకు అర్థం బలి దానమా




1. నిన్నేరుగక ఆనాడు దూషించి తిరిగితిని

నీ మహిమను నే కానక అవమాన పరచితిని

నా కరములు నీవు వీడక కాపాడినది

ఈ దీనుని ధన్యునిగా చేయాలనా




2. ఘోర వ్యాధితో నేను రోదించిన వేళ్ళలో

దరిరాలేదేవ్వారు నన్నాదరింప గను

ఇలలో దొరకని ప్రేమను చూపించినది

నా స్వామీ నీ సాక్షిగా ఉండాలనా




3. నా పాప కాడి క్రింద నలిగిపోతిని

కలువరిలో నా కొరకు కరిగిపోతిని

ఈ పాపిని పరిశుద్దులలో చేర్చాలనా

పరమపురికి నా నావ సాగాలనా


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com