కొంత సేపు కనబడి అంతలోనే మాయమయ్యే
kontha sepu kanabadi anthalo
పల్లవి : కొంత సేపు కనబడి - అంతలోనే మాయమయ్యే
ఆవిరి వంటిది రా ఈ జీవితం - లోకాన కాదేదీ శాశ్వతం (2)
ఏసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు
మరణమైన జీవమైన నిన్ను విడువదు (2)
1. ఎదురౌ తారెందరో నీ పయనం లో
నిలిచేది ఎందరూ నీ అక్కరలో
వచ్చేదేవరూ నీతో మరణం వరకు (2)
ఇచ్చేదేవరూ ఆపై నిత్య జీవము నీకు ( ఏసే )
2. చెమటోడ్చి సుఖము విడిచి కష్టములోర్చి
ఆస్తులు సంపాదించిన శాంతి యున్నదా
ఈ రాత్రే దేవుడు నీ ప్రాణ మడిగితే (2)
సంపాదన ఎవరిదగును యోచించితివా ( ఏసే )
3. నీ శాపం తాను మోసి పాపం తీసి
రక్షణ భాగ్యం నీకై సిద్దం చేసి
విశ్రాంతి నియ్యగా నిన్ను పిలువగా (2)
నిర్లక్ష్యము చేసిన తప్పించుకొండువా (ఏసే)