• waytochurch.com logo
Song # 2434

kaalamella maarinaa కాలమెల్ల మారినా మారడు నా యేసు నాధుడు



పల్లవి : కాలమెల్ల మారినా - మారడు నా యేసు నాధుడు

భూమి మార్పు చెందినా - నా స్వామి యేసు మాట తప్పడు

పరలోక మహిమను - దివిదూత గణమును

విడనాడి నన్ను వేడుక వచ్చెను

ఆ ఘోర సిలువను - నా కొరకు మోసెను

పాపి కొరకు ప్రాణమిచ్చెను (కా)

1. మరణ ముల్లును విరచివేసెను - సమాధి నుండి తిరిగి లేచెను

కరుణ తోడను - నా కడకు చేరెను

నా ప్రాణ నాధుడు - నా ప్రేమ పూర్ణుడు

నాదు బ్రతుకు మార్చి వేసెను (కా)

2. మంచి కాపరి - నా చెంత చేరెను

లేమిని లేకుండా చేసెను

దారి తప్పిన - నన్ను వెదకెను - జాలిని నాపైన జూపెను

పాతవి గతించెను - గీతమాలపింతును

యేసు తోడ నుందు నిరతము (కా)

3. దాగు చోటుగా - నా దివ్య బాటగా - నా యేసు నన్ను చేరెను

కన్న తల్లిగా - నా ప్రాణ ప్రియునిగా - యేసు నాదు ముందు నడిచేను

నాకు తోడు నీడగా - నీ కృప నాకుండగా

కొదువలేదు - దిగులు లేదుగా (కా)


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com