• waytochurch.com logo
Song # 2436

dhevuni sthuthiyinchudi ellapuddu దేవుని స్తుతియించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి



దేవుని స్తుతియించుడి - ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి ఆ ..

1. ఆయన పరిశుద్ద ఆలయమందు - ఆయన సన్నిదిలో

ఆ .. ఆ .. ఆయన సన్నిదిలో - ఎల్లప్పుడు




2. ఆయన బలమును ప్రసిద్ది చేయు - ఆకాశ విశాలమందు

ఆ .. ఆ.. ఆకాశ విశాలమందు - ఎల్లప్పుడు




3. ఆయన పరాక్రమ కార్యముల్ బట్టి - ఆయన ప్రభావమును

ఆ..ఆ.. ఆయన ప్రభావమును - ఎల్లప్పుడు




4. బూర ధ్వనితో ఆయనన్ స్తుతియించుడి - స్వరమండలములతో

ఆ...ఆ.. స్వరమండలములతో - ఎల్లప్పుడు




5. సన్నాతంత్రుల సితారతోను - చక్కని స్వరములతో

ఆ..ఆ.. చక్కని స్వరములతో - ఎల్లప్పుడు




6. తంబురతోను నాట్యముతోను - తంతి వాయిద్యములతో

ఆ..ఆ.. తంతి వాయిద్యములతో - ఎల్లప్పుడు




7. పిల్లన గ్రోవులు చల్లగానూది - ఎల్ల ప్రజలు చేరి

ఆ..ఆ.. ఎల్ల ప్రజలు చేరి - ఎల్లప్పుడు




8. మ్రోగు తాళములతో ఆయనను స్తుతియించుడి గంభీర తాళముతో

ఆ..ఆ.. గంభీర తాళముతో - ఎల్లప్పుడు




9. సకలా ప్రాణులు యెహోవాను స్తుతియించుడి - హల్లెలుయా ఆమెన్

ఆ..ఆ.. హల్లెలుయా ఆమెన్ - ఎల్లప్పుడు


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com