ninnu batti నిన్ను బట్టి బ్రతుకుతున్న నీరీక్షణతో జీవిస్తున్నా
నిన్ను బట్టి బ్రతుకుతున్న- నీరీక్షణతో జీవిస్తున్నా
నా జీవిత దోనేలో - తుఫానులేన్ని రేగినా
ఆవరించిన ఆత్మ నాధుడా - అద్దరికి ననుజేర్చిన అద్వితీయుడా
1. వాగ్దాన పుత్రునిచ్చి దీవించావు - నాకే అర్పించమని శోదిన్చావు
ఎన్నటికి మారని వాగ్దానముందని
కన్నా కొడుకు కన్నా నిన్నే ప్రేమించేనని ( నిన్ను బట్టి )
2. హన్నా కన్నీరు తుడిచి అభిషిక్తునిచావు - ఆనాటి సమాజాన్ని ఉద్దరించావు
అన్నా మాట ప్రకారం అర్పించిన గర్బ ఫలం
అన్నిటికి ముందే ఆశించిన విశ్వాసం
అందుకున్న నాడు అంతులేని సంతోషం ( నిన్ను బట్టి )
3. అగ్ని లో అబెద్నగోల విశ్వాసం - నలుగురిలో దానియేలు ధైర్య సాహసం
సింహాల బోనులో చెలరేగిన సంచలనం
పరీక్షలో విజయం తమదేనని
విశ్వాసికి విశ్వంతో ఎదురు లేదని ( నిన్ను బట్టి )