perupetti pilachinaadu పేరుపెట్టి పిలిచినాడు నీ స్నేహితుడు
పల్లవి : పేరుపెట్టి పిలిచినాడు - నీ స్నేహితుడు
నేన్ను చూచి - నిలిచినాడు దావీదు సుతుడు
కానలేకున్నావా - దారి తెలియదన్నావా ?
నమ్మితే చాలు నేస్తమా - దేని గూర్చి చింత పడకుమా !
1. కంటి కునుకు లేక యున్తివా - మోయలేని భారము
దాటలేని తీరము - వేదనతో కుములు చుంటివా !
లోకులేన్దరున్న - నీ కేక విన్నారా
నీకు తోడు నీడగా - నీతో వచ్చారా ! ( న )
2. ఆదరనే లేక యుంటివా ఆదుకొనేవారు
నీ భాద వినేవారు - లేరని - ఏడ్చు చుంటివా
నమ్ముకోన్నవారే నిన్నేరుగనందురు
కష్ట కాల మందు నిన్ను మరచి పోదురు ( న )
3. సీయోను - చింత పడకుమా - చెంత చేరినాడు -
నీ చింత బాపువాడు
చూడుమా - నీ కరుణామయుడు
దిట్టమైన చోట - మేకు కొట్టినట్టుగా
స్తిరపరచి - బలపరచును నిన్ను ఏసుడు ( న )
4. ముగిసి పోయే యుద్ధ కాలము
తొలగి పోయెను - నీ పాప శాపము - దోషరునము
తీరిపోయెను - ప్రేమ చూపుచున్నాడు ప్రాణ నాధుడు
నిన్ను చేర వచ్చుచుందే - యేసు నాధుడు ( న )