raathi kundanu రాతి కుండను నేను ఖాళియై యున్నాను
రాతి కుండను నేను - ఖాళియై యున్నాను
నింపుమా.. అంచులవరకూ - 2
నీకింపుగా.. మార్చబాడుటకు - 2
1. వెఱ్ఱి ద్రాక్షలు.. లోనికి చేరెను - అంతరంగము చేదుగా మారెను.
మాధుర్యం పంచుటకు.. తగిన పాత్రగా - 2
శుభ్రము చేయుమా - నను శుభ్రము చేయుమా
నింపుమా.. అంచులవరకూ - 2
నీకింపుగా.. మార్చబడుటకు - 2
2. జీవ డంభము మిగిలి యుండెను - లోకస్నేహము చెరుపుచుండెను
మాలిన్యం ఏమాత్రం అంటకుండగా - 2
భద్రము చేయుమా - నను భద్రము చేయుమా
నింపుమా.. అంచులవరకూ - 2
నీకింపుగా.. మార్చబడుటకు - 2
3. తప్పుబోధకు కలతచెందక - చెడ్డమాటతో శ్రమను పొందక
నీకోసం నమ్మికతో - ఎదురుచూడగా - 2
సిద్ధము చేయుమా - నను సిద్ధము చేయుమా
నింపుమా.. అంచులవరకూ - 2
నీకింపుగా.. మార్చబడుటకు - 2