aalochinchumu aalochimchu ఆలోచించూ ఆలోచించు ఓ నా నేస్తం ఆలోచించు
ఆలోచించూ ఆలోచించు - ఓ నా నేస్తం ఆలోచించు
అన్వేషించూ అన్వేషించు - ఒక్కసారి అన్వేషించు = 2
నీ గమనం ఏమైయుందో - నీ గమ్యం ఎక్కడ ఉందో
ఏ తరుణం ఏమౌతుందో - నీ తీర్పు ఏమైయుందో
దేవుడు అడిగే ప్రశ్నకు నువ్వు - బదులేమిస్తావో..!?
1. నీతిగా నువ్వే జీవిస్తే - దేవుని రాజ్యం నీదవదా
చీకటి దారి నీదైతే - నిప్పుల వలలే ఎదురవవా = 2
నీ పాపపు జీవితమంతా - ప్రభురక్తంలో కడగాలి
నీ ఎదలో దేవుని ధ్యానం - వినిపించే స్వరమవ్వాలి
సగము ఇహము - సగము పరమని జీవిస్తున్నావా..?!
2. దుష్టుల స్నేహం విడిపోతే - హృదయం దేవుని వశమేగా
పాపుల మార్గంలో వెళితే - మరణం నీకు శరణవదా = 2
చెడు పలికే నీ పెదవులకు - ప్రభు ప్రార్ధన ఫలమిస్తుందా
చెడు చూసే నీ కన్నులకు - పరలోకం కనిపిస్తుందా
ఇదియే సమయం - ఇపుడే యేసుకు మనసిస్తున్నావా..?!